అచ్యుతాపురం రూరల్ : నెల్లూరు జిల్లా బుచ్చిరాజుపాలెంలో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి వుషు పోటీల్లో అచ్యుతాపురం కేజీబీవీకి చెందిన 9వ తరగతి విద్యా ర్థిని వాసుపల్లి మాధవి స్వర్ణ పతకం సాధించారు. జమ్మూ కశ్మీర్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఆమెను జిల్లా అదనపు పథక సమన్వయకర్త శ్రీరాము లు, జీసీడీవో జెమిమా అభినందించారు.
వుషు పోటీల్లో స్వర్ణ పతకం
నర్సీపట్నం: నెల్లూరు జిల్లాలో అండర్ – 17 బాలికల విభాగం వుషు పోటీల్లో విద్యార్థిని సకిరెడ్డి హరిణి 60 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. నర్సీపట్నం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని హరిణి, పీడీ వెంకటలక్ష్మిని హెచ్‌ఎం మాధవి, ఉపాధ్యాయులు అభినందించారు.


