బుచ్చెయ్యపేట: మండలంలోని మల్లాం, ఎంబీ పాలెం గ్రామాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సమక్షంలో గురువారం వైఎస్సార్‌సీపీలో చేరారు. రెండు గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులు గొలగాని గోవిందరాజు, గొలగాని రమణ, బోగాది అప్పారావు, గొలగాని రామునాయుడు, మురుగుటి రాజు, చందక దేముడు, కలం చిన్ననాయుడు తదితర 40 మంది తమ కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ అమర్‌నాథ్ పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ పరిపాలన విధానం నచ్చక ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరినట్లు వారు తెలిపారు. ఇకపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాఽథ్‌ల అడుగుజాడల్లో నడుచుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు జోగా కొండబాబు, మాజీ జెడ్పీటీసీ దొండా రాంబాబు, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి కె. అచ్చింనాయుడు, తాజా మాజీ సర్పంచ్‌లు బర్ల శివ, నమ్మి అప్పలరాజు, మండల బీసీ సెల్ కార్యదర్శి పల్లా పోలినాయుడు, గ్రామ అధ్యక్షుడు మువ్వల అప్పారావు, మాజీ ఉప సర్పంచ్ అప్పాన రాము, నాయకులు వాయిబోయిన అప్పలనాయుడు, గొలగాని లోవరాజు, బర్నికాన చిన అప్పలనాయుడు, గారపాటి రమణ, కరణం నర్సింగరావు, గణేష్ పాల్గొన్నారు.


