● వైద్య సహాయం కోరుతూ ఫండ్ రైజింగ్ ర్యాలీ
ఫండ్ రేజింగ్ ర్యాలీలో పాల్గొన్న యువత, స్వచ్ఛంద కార్యకర్తలు, విద్యార్థులు
నర్సీపట్నం : అరుదైన వ్యాధి డీఎండీతో బాధపడుతున్న బాలుడును ఆదుకునేందుకు కొంత మంది ముందుకు వచ్చి పట్టణంలో ఫండ్ రైజింగ్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో యువత, స్వచ్ఛంద కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీదుర్గామల్లేశ్వరి ఆలయం నుండి అబిద్‌సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. కశింకోట మండలం, జమ్మాదులపాలెం గ్రామానికి చెందిన పొన్నగంటి ప్రణయ్ సూర్య(7) అరుదైన ప్రాణాంతకమైన డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యం కొరకు రూ.42 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు సూచించడంతో చిన్నారి తల్లిదండ్రులు సురేష్ కుమార్ దాతలను ఆశ్రయిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించారు. శ్రీవిద్య, ప్రగతి, శ్రీసాయి కాలేజీల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని తమ వంతు ఆర్థిక సహాయం అందజేశారు.


