యూనిట్ మ్యాప్‌ను పరిశీలిస్తున్న జీసీసీ ఎండీ శోబిక
మాకవరపాలెం: కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ స్థలాన్ని జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ శోబిక సందర్శించారు. మండలంలోని శెట్టిపాలెంలో రూ.10 కోట్లతో నిర్మించే కాఫీ ప్రాసెసింగ్ యూనిట్‌కు 12 ఎకరాలు సేకరించారు. ఈ నెల 13న ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు భూమిపూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని గురువారం ఎండీ జీసీసీ అధికారులతో కలసి సందర్శించారు. యూనిట్‌కు సంబంధించిన మ్యాప్‌ను కూడా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో శెట్టిపాలెం, భీమబోయినపాలెం మాజీ సర్పంచ్‌లు అల్లు రామునాయుడు, రుత్తల నందకిషోర్, జీసీసీ అధికారులు పాల్గొన్నారు.


