విద్యార్థులతో ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులు
గొలుగొండ: ఇటీవల జరిగిన క్రీడా పోటీల్లో చోద్యం జిల్లా పరిషత్ విద్యార్థులు ప్రతిభను కనపరచారు. అల్లూరి జిల్లా కొయ్యూరులో జరిగిని రెజ్లింగ్ పోటీల్లో అండర్ 14–లో అమర్, అండర్ –17లో లోకసాయి మంచి ప్రతిభ కనపరచడంతో రాష్ట్రస్ధాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది.అలాగే అరకులో జరిగిన ఎస్జీఎఫ్ స్కూల్గేమ్స్లో వెయిట్ లిప్టింగ్లో బాగంగా అండర్ 19లో పి వసంత, జె సుజాత ఇద్దరు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగిందని హైస్కూల్ హెచ్ఎం శ్రీనువాసరావు తెలిపారు.


