నక్కపల్లి : జాతీయ రహదారిపై నక్కపల్లి ఏరియా ఆస్పత్రి సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలివి. మండలంలో సారిపల్లిపాలెం గ్రామానికి చెందన శీరం నూకరాజు 38, పొల్నటి సూర్యకుమార్ 30 నక్కపల్లి నుంచి సారిపల్లిపాలెం మోటారు సైకిల్‌పై వెళ్తూ ఆస్పత్రి ఎదురుగా రోడ్డు వద్ద మలుపు తిరుగుతుండగా అడ్డురోడ్డు నుంచి నక్కపల్లి వైపు వస్తున్న మరో బైక్ వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నూకరాజు, సూర్యలు బైక్‌పై నుంచి కిందపడడంతో తలకు బలమైన గాయాలై సంఘటన స్థలంలోనే మరణించారు. వీరి బైక్‌ను ఢీకొట్టిన మరో ఇద్దరు పిట్టా రామకృష్ణ, నాగేశ్వరరావులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం నక్కపల్లి ఆస్పత్రికి తరలించారు.
ఐదు నిమిషాల్లో ఇంటికి చేరేలోగా...
సారిపల్లిపాలెం గ్రామానికి చెందిన నూకరాజు, సూర్యలు స్నేహితులు. ఐదు నిమిషాల్లో ఇంటికి చేరిపోతామనగా మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వీరిని కబళించింది. మృతుల్లో సూర్యకు ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. గ్రామస్తులు, బంధువులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని భోరున విలపించారు. గ్రామానికి చెందిన ఇద్దరి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలమకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతులు నూకరాజు, సూర్య (ఫైల్)


