పోర్టు ప్రతిపాదిత ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సీపీఎం నాయకులు
నక్కపల్లి: డీఎల్‌పురం వద్ద ఆర్సెలర్ మిట్టల్ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం నిర్మిస్తున్న క్యాప్టివ్ పోర్టుకు సంబంధించి ఈ నెల 15న నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణను నిలిపివేయాలని సీపీఎం నాయకులు, రైతులు డిమాండ్ చేశారు. బుధవారం పోర్టు నిర్మించనున్న ప్రాంతాలను సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పలరాజు తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీఎల్‌పురం గ్రామంలోని సర్వే నంబర్లు 85, 82లో సుమారు 202 ఎకరాల భూములను పేదలు సాగు చేసుకుంటున్నారని తెలిపారు. ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండానే కూటమి ప్రభుత్వం ఈ భూములను స్టీల్‌ప్లాంట్‌కు అప్పగించిందని ఆరోపించారు. సాగుదారులకు నష్టపరిహారం చెల్లించకుండా పోర్టు నిర్మాణానికి ఎలా అనుమతులు ఇస్తారని ప్రశ్నించారు. పోర్టు నిర్మాణం జరిగితే భూములపై ఆధారపడి జీవిస్తున్న రైతులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా సాగుదారులందరికీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు శ్రీనివాస్, గోవిందు, సత్తిబాబు, రాజేష్, చంద్రరావు, కనకారావు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


