మాడుగుల బీసీ వసతి గృహం వద్ద విద్యార్థులతో కలసి ఆందోళన చేస్తున్న నాయకులు
మాడుగుల: పట్టణంలో 52 ఏళ్లుగా కొనసాగుతున్న బీసీ హాస్టల్‌ను మూసివేయొద్దని విద్యార్థులు, జనసేన పార్టీ నాయకులు గురువారం ఆందోళన నిర్వహించారు. ఇక్కడ హాస్టల్‌లో విద్యార్థుల సంఖ్య తక్కువ ఉందని మూసివేయడం విరమించుకోవాలని జనసేన నాయకుడు రొబ్బా మహేష్ తదితరులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం 42 మంది విద్యార్థులు వసతి గృహంలో ఉన్నారని, కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఈ విషయమై వార్డెన్ శ్రీరాంమూర్తిని సంప్రదించగా, వసతి గృహ భవనం మరమ్మతులకు గురవడంతో ఈ ఏడాది విద్యార్థులు చేరలేదన్నారు. నిబంధనల ప్రకారం 50 మందికి తక్కువ ఉంటే, మరో వసతి గృహానికి మార్చాలని ఆదేశాలు వచ్చాయన్నారు.


