చదరంగం పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు
అచ్యుతాపురం రూరల్ : చదరంగం క్రీడ మనోవికాసానికి దోహదపడడంతో పాటు జ్ఞానాన్ని పెంపొందిస్తుందని ప్రముఖ వ్యాపారి కర్రి వరహ పైడిరాజు పేర్కొన్నారు. బుధవారం తిమ్మరాజుపేటలో జిల్లా స్థాయి చదరంగం పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చెస్ అసోసియేషన్ గౌరవధ్యక్షుడు తనకాల అనంతరావు మాట్లాడుతూ చదరంగం, జీవితం రెండింటిలోనూ ప్రారంభం, మధ్య, ముగింపు దశలు ఉంటాయని ప్రతి దశలోనూ అప్రమత్తంగా వ్యవహరిస్తే విజయాన్ని సాధించవచ్చన్నారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 40 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మొదటిరోజు మూడు రౌండ్లు జరిగాయని నిర్వాహకులు తెలిపారు.


