● పాడేరులో ముగిసిన చవితి ఉత్సవాలు
పాడేరులో వినాయక విగ్రహం ఊరేగింపు
సాక్షి, పాడేరు: పట్టణంలోని సుండ్రుపుట్టు వినాయక గుడి వద్ద వినాయకచవితి ఉత్సవాలు బుధవారం రాత్రి ఘనంగా ముగిశాయి. పండగ రోజు నుంచి కొలువుదీరిన భారీ గణపతి విగ్రహానికి ఉత్సవ కమిటీతో పాటు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణపతి విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించి స్థానిక గెడ్డలో నిమజ్జనం చేశారు. లడ్డూ వేలం పాట కూడా పోటాపోటీగా సాగింది. రూ.1.35 లక్షలకు భక్తుడు వందేమాతరం శ్రీనివాస్ లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు.


