బాడీ బిల్డింగ్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

బాడీ బిల్డింగ్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రతిభ

Oct 8 2026 1:00 AM | Updated on Oct 8 2026 1:00 AM

హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసరావును

అభినందిస్తున్న రూరల్‌ సీఐ రేవతమ్మ

నర్సీపట్నం : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బెంచ్‌ ప్రెస్‌ 13వ చాంపియన్‌ షిప్‌ పోటీలు ఇటీవల ఎన్టీఆర్‌ జిల్లా, తిరువూరులో జరిగాయి. ఈ బాడీ బిల్డింగ్‌ పోటీల్లో కె.డి.పేట పోలీసు స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కె.శ్రీనివాసరావు అద్భుతమైన ప్రతిభ కనబరిచి బ్రాంజ్‌ మెడల్‌ సాధించాడు. ఈ సందర్భంగా నర్సీపట్నం రూరల్‌ సీఐ ఎల్‌.రేవతమ్మ, సిబ్బంది శ్రీనివాసరావుకు శాలువా కప్పి సత్కరించారు. విధి నిర్వహణలో సమర్ధవంతంగా పని చేయడమే కాకుండా క్రీడల్లో రాణించడం పోలీసు డిపార్టుమెంట్‌కు గర్వకారణమని సీఐ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement