అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యా యత్నం | - | Sakshi
Sakshi News home page

అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యా యత్నం

Oct 8 2026 1:00 AM | Updated on Oct 8 2026 1:00 AM

రైల్వే ట్రాక్‌ నుంచి కృష్ణప్రసాద్‌ను తీసుకొస్తున్న ఎస్‌ఐ రమేష్‌,

కృష్ణప్రసాద్‌ను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న ఎస్‌ఐ

ఎస్‌.రాయవరం : మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి అప్పుల బాధ తాళలేక రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడబోయాడు. ఆ సమయంలో గమనించిన మరో వ్యక్తి రైలు వచ్చేలోపు అతనిని బయటకు లాగి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటనపై ఎస్‌ఐ రమేష్‌ అందించిన వివరాలిలా ఉన్నాయి. ఒక వ్యక్తి చనిపోతున్నాడన్న వీడియోరావడంతో ఆ ఫోన్‌ లోకేషన్‌ ద్వారా ఆచూకీ తెలుసుకుని యలమంచిలి మండలం పులపర్తి రైల్వే ట్రాక్‌వద్దకు వెళ్లామన్నారు. ట్రాక్‌పై ఎస్‌.రాయవరానికి చెందిన అద్దాల కృష్ణప్రసాద్‌ ఉన్నట్టు గుర్తించామన్నారు. అదే సమయంలో ప్రసాద్‌ అనే వ్యక్తి పట్టాల నుంచి కృష్ణప్రసాద్‌ను బయటకు లాగడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు. ఈ మేరకు కృష్ణ ప్రసాద్‌ను అదుపులోనికి తీసుకుని కౌన్సెలింగ్‌ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. ఫైనాన్స్‌ అప్పులు ఎక్కువగా ఉండడం వల్ల వారి వేధింపులతో అతను ఈ చర్యకు పాల్పడినట్టు కృష్ణప్రసాద్‌ ద్వారా తెలుసుకున్నామన్నారు. తాత్కాలికంగా అతనిపై వేధింపులు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement