రూ.110 కోట్లు ఉపాధి బకాయిలు వెంటనే చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

రూ.110 కోట్లు ఉపాధి బకాయిలు వెంటనే చెల్లించాలి

Oct 8 2026 1:00 AM | Updated on Oct 8 2026 1:00 AM

● ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకన్న డిమాండ్‌

దేవరాపల్లి: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రూ. 110 కోట్లు ఉపాధి హామీ పనుల బకాయిలను తక్షణమే చెల్లించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి. వెంకన్న డిమాండ్‌ చేశారు. మండల కేంద్రం దేవరాపల్లిలో బుధవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో ఈ ఏడాది జూన్‌ 30 వరకు ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకంలో చేపట్టిన పనులకు రూ. 54.64 కోట్లు, జూలై ఒకటి నుంచి అమలులోకి వచ్చిన వీబీజీరాంజీ పథకంలో చేపట్టిన రూ. 55.89 కోట్లు మేర బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. వెరసి జిల్లాలో 2,44,823 మంది వేతనదారులు కూలి సొమ్ము కోసం ఎదరు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కొందరు వలసలు పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త, పాత పథకాలలో పని చేసిన పనులకు వేతనాలు అందక కూలీలు ఆర్థిక ఇబ్బందులతో దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిత్యవసరాల కోసం కూడా అప్పులు చేయాల్సిన దయనీయ పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పెండింగ్‌ సొమ్మును చెల్లించాలని లేకుంటే జిల్లా వ్యాప్తంగా ఉపాధి కూలీలతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement