డైవర్షన్‌ రోడ్డులో ఇసుక ట్రాక్టర్‌ బోల్తా | - | Sakshi
Sakshi News home page

డైవర్షన్‌ రోడ్డులో ఇసుక ట్రాక్టర్‌ బోల్తా

Oct 8 2026 1:00 AM | Updated on Oct 8 2026 1:00 AM

బుచ్చెయ్యపేట : విజయరామరాజుపేట డైవర్షన్‌ రోడ్డులో ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడడడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. బుధవారం చీడికాడ మండలం దిబ్బూరు నుండి వడ్డాది వైపు వస్తున్న ఇసుక ట్రాక్టర్‌ విజయరామరాజుపేట తాచేరు వెంతెన వద్ద డైవర్షన్‌ రోడ్డు గోతుల్లో బోల్తా పడింది. గతంలో తాచేరు వంతెన కూలిపోవడంతో కూలిన వంతెన పక్క నుంచి రాకపోకలు సాగేలా ఇరుకుగా డైవర్షన్‌ రోడ్డు ఏర్పాటు చేశారు. డైవర్షన్‌ రోడ్డు గోతులు పడి రాళ్లు తేలి రాకపోకలకు అనుకూలంగా లేదు. ఇసుక లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ గోతుల్లో పడి ఇరుసు విరిగిపోయి రోడ్డుపై బోల్తా పడింది. దీంతో వడ్డాది, చోడవరం మధ్యన తిరిగే ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం తెలుసుకున్న బుచ్చెయ్యపేట ఎస్‌ఐ పి.మనోజ్‌కుమార్‌ పొక్లెయిన్‌ను తీసుకొచ్చి ట్రాక్టర్‌ను పక్కకు తీయించి రోడ్డుపై పడిన ఇసుకను తొలగించారు. ట్రాక్టర్‌ బోల్తా పడినపుడు ఆ పక్క నుంచి ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement