నక్కపల్లి : మండలంలో వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఎంపీ నిధులు మంజూరు చేయాలని పలువురు నాయకులు రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావును కోరారు. బుధవారం బాబూరావు మండలంలో దేవవరం, డీఎల్‌పురం, రాజయ్యపేట తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి శీరం నర్సింహమూర్తి, ప్రచార విభాగం రాష్ట్ర కార్యదర్శి లొడగల చంద్రరావు, మండల పార్టీ కార్యదర్సి ఎరిపల్లి నాగేశు తదితరులు బాబూరావును కలిసి పలు వినతి పత్రాలు అందజేసారు. కూటమి ప్రభుత్వం వచ్చేక గ్రామాల్లో టీడీపీ వాళ్లకే నిధులు కేటాయిస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఉన్న ఏరియాలో నిధులు కేటాయించడం లేదన్నారు. ఎంపీ నిధులు కేటాయిస్తే గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని బాబూరావు హామీ ఇచ్చారు. ఎంపీని కలిసిన వారిలో నాయకులు లొడగల కృష్ణ, ప్రసాదుల శ్రీను అల్లురమణ పాల్గొన్నారు.


