బైక్‌ చోరీకి పాల్పడిన ఇద్దరు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

బైక్‌ చోరీకి పాల్పడిన ఇద్దరు అరెస్టు

Oct 8 2026 1:00 AM | Updated on Oct 8 2026 1:00 AM

అనకాపల్లి : బైక్‌ చోరీకి పాల్పడిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు పట్టణ క్రైం ఎస్‌ఐ అల్లు వెంకటేశ్వరరావు బుధవారం చెప్పారు. ఏలూరు జిల్లా తెంగళ్లమూడి, పుష్పలీలానగర్‌కు చెందిన సిద్దాంతపు హరీష్‌ అలియాస్‌ హనోక్‌, రాజమహేంద్రవరం రూరల్‌ శాటిలైట్‌ సిటీ, నామవరం గ్రామానికి చెందిన పెద్దసింగ్‌ రేవంత్‌ అలియాస్‌ సాయిలు ఈ ఏడాది సెప్టెంబర్‌ 21న అనకాపల్లి పట్టణంలో వేంకటేశ్వరస్వామి దేవాలయం వెనుక పార్కింగ్‌ చేసిన రాయల్‌ ఇన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ వాహనాన్ని అపహరించారు. వాహనదారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. జాతీయ రహదారి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం జరిగిందని ఎస్‌ఐ చెప్పారు. ఈ మేరకు ఇద్దరిని కోర్టులో హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్‌ విధించినట్టు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement