సకాలంలో వైద్య సేవలు అందించండి | - | Sakshi
Sakshi News home page

సకాలంలో వైద్య సేవలు అందించండి

Oct 7 2026 12:11 AM | Updated on Oct 7 2026 12:11 AM

● కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశం ● మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వర్చువల్‌గా విలేజ్‌ క్లినిక్‌ భవనాల ప్రారంభం

తుమ్మపాల: గర్భిణులు, బాలింతలు, శిశువులకు సకాలంలో వైద్య సేవలు అందేలా వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశించారు. శిశు, నవజాత శిశు మరణాల రేటును మరింత తగ్గించేందుకు వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది సమష్టిగా కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం జనార్దనపురం నుంచి అనకాపల్లి జిల్లాలో నూతనంగా నిర్మించిన నాలుగు ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌–విలేజ్‌ క్లినిక్‌ భవనాలను మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలు విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. ముఖ్యంగా పునరుత్పత్తి ఆరోగ్య సేవలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న 96 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల పనులను వేగవంతం చేసి డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం పెదపాడులో రూ.32 లక్షలు, కాజీపాలెంలో రూ.32 లక్షలు, నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మండలం ధర్మసాగరంలో రూ.24 లక్షలు, పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలం చౌడువాడలో రూ.26 లక్షలతో నిర్మించిన విలేజ్‌ క్లినిక్‌ భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి ఎమ్మెల్యే విజయకుమార్‌, జేసీ శౌర్యమాన్‌ పటేల్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ అచ్యుతకుమారి, ఏపీ అర్బన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పీలా గోవింద సత్యనారాయణ, హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ తాతబాబు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ బాలాజీ, గవర కార్పొరేషన్‌ చైర్మన్‌ మళ్ల సురేంద్ర పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement