సైనిక లాంఛనాలతో జవాన్‌ అంత్యక్రియలు | - | Sakshi
Sakshi News home page

సైనిక లాంఛనాలతో జవాన్‌ అంత్యక్రియలు

Oct 7 2026 12:11 AM | Updated on Oct 7 2026 12:11 AM

అచ్యుతాపురం రూరల్‌: రాంచీలో విధి నిర్వహణలో ఉండగా ఈ నెల 4న గుండెపోటుతో మృతి చెందిన మండలానికి చెందిన సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌ ఎరికిరెడ్డి భూషణం(38) అంత్యక్రియలు మంగళవారం స్వగ్రామం మడుతూరులో సైనిక లాంఛనాలతో నిర్వహించారు. భూషణం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. మృతదేహాన్ని చూసిన భార్య సూర్యకళ, ఇద్దరు పిల్లలు, కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు అక్కడున్న వారిని కలచివేశాయి. భర్త ఇక లేడన్న నిజాన్ని జీర్ణించుకోలేక సూర్యకళ కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయిన ఇద్దరు పిల్లలను చూసి గ్రామస్తులు సైతం కంటతడి పెట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement