అమ్మా కరుణించు.. వానలు కురిపించు..! | - | Sakshi
Sakshi News home page

అమ్మా కరుణించు.. వానలు కురిపించు..!

Oct 7 2026 12:11 AM | Updated on Oct 7 2026 12:11 AM

అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అభిషేకాలు చేస్తున్న కలెక్టర్‌, జేసీ, ఎమ్మెల్యే

అనకాపల్లి: జిల్లాలో సకాలంలో వర్షాలు కురిసి పాడి, పంటలు అభివృద్ధి చెంది రైతులు, ప్రజలు ఆరోగ్యంగా జీవించాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆకాంక్షించారు. గవరపాలెంలోని నూకాంబిక అమ్మవారి ఆలయంలో దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వరుణ యాగం, హోమం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పంచామృతాభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ సౌర్యమాన్‌ పటేల్‌, ఆలయ సహాయ కమిషనర్‌ యాళ్ల శ్రీధర్‌, చైర్మన్‌ పీలా నాగశ్రీను, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement