బుచ్చెయ్యపేట: మండలంలోని రాజాం గ్రామానికి చెందిన జెర్రిపోతుల అప్పలనాయుడుకి తాను చదివిన పాఠశాలలోనే పీఈటీగా పోస్టింగ్ లభించింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన అప్పలనాయుడు ఐదో తరగతి వరకు రాజాంలో చదివాడు. మునగపాక ఎస్సీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి వరకు, అనంతరం ప్రైవేట్‌గా డిగ్రీ పూర్తి చేసి, ఆ తర్వాత కాలేజీలో ఏడాది పాటు పీఈటీ కోర్సు పూర్తి చేశాడు. ఇటీవల రాజాంలో పీఈటీగా పోస్టింగ్ లభించడంతో ఆదివారం గ్రామంలో ఆకుల ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామస్తులు అప్పలనాయుడును ఘనంగా సన్మానించారు.


