నాతవరం : భక్తులు ఆరాధ్య దైవంగా పూజించే అది దేవుడు వినాయక పండగ పూజకు సర్వం సిద్ధం చేసుకున్నారు. నాతవరం మండలం జిల్లేడుపూడి పంచాయతీలో వినాయకుడి విగ్రహం ఉంది. ఇక్కడ మర్రిచెట్టు ఊడలు నీడలో చూడముచ్చటగా వినాయకుడి విగ్రహం ఉంది. ఏనుగుతొండంలోంచి ఆలయం నిర్మించారు. ఇక్కడ ప్రధానంగా మర్రిచెట్టు నీడలో అమ్మవారి ఆలయం ఉంది. అమ్మవారికి ఎడమ భాగంలో వినాయకుడి ఆలయం కుడి భాగంలో 50 అడుగుల ఎత్తయిన నాగసర్పంతో కూడిన శివలింగం నిర్మించారు,. వినాయక పండగ సందర్భంగా ముందు ఆదిదేవుడికి పూజ అనంతరం అమ్మవారిని, శివలింగాన్ని భక్తులు దర్శించుకోవడం ఆనవాయితీ. జిల్లేడుపూడి వద్ద ఏలేరు కాలువకు సొరంగం తవ్వకాల కోసం వచ్చిన కాంట్రాక్టరు ప్రభాకర్ చౌదరి నిర్మాణ పనులు అనంతరం 1988లో ఆలయాలు నిర్మించారు. అనాటి నుంచి ఇక్కడ వినాయకుడికి వైభవంగా పండగ చేస్తుంటారు.
అలాగే నాతవరం వినాయక ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ యర్రా కాశీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. తాండవ జంక్షన్, ఎం.బి.పట్నం తదితర గ్రామాల్లోనూ వినాయక చవితి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు.


