పర్యావరణ పరిరక్షణకు మట్టి ప్రతిమలు | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణకు మట్టి ప్రతిమలు

Sep 14 2026 3:32 AM | Updated on Sep 14 2026 3:32 AM

ఎస్‌.రాయవరం: మట్టి గణపతులను పూజించడం వల్ల పర్యావరణానికి మేలు చేసినవారు అవుతారని వైఎస్సార్‌సీపీ పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. గోకులపాడు గ్రామానికి చెందిన ఏజీ ఫౌండేషన్‌ వారు ఏర్పాటు చేసిన వందకు పైగా మట్టి గణపతి ప్రతిమలను కంబాల జోగులు, పార్టీ నాయకులు భక్తులకు ఆదివారం పంపిణీ చేశారు. వినాయక వ్రత కల్పం పుస్తకాలను అందజేశారు. వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు ఎస్‌ఏఎన్‌ మధువర్మ, వైస్‌ ఎంపీపీ చోడిపల్లి అప్పన్న, నాయకులు నాగంబోయిన శేషు, శ్రీనివాసరావు, నియోజకవర్గ పంచాయతీరాజ్‌ అధ్యక్షుడు కర్రి సత్యనారాయణ, సర్పంచ్‌ల సంఘ మండల కార్యదర్శి కోశెట్టి వెంకటరమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి శీరం నరసింహామూర్తి, నాయకులు చేకూరి అశోక్‌రాజు, పినపాల ప్రసాద్‌, గనగళ్ల రాజేష్‌, చోడిపల్లి గోవిందు, నక్కా నాగేశ్వరరావు పాల్గొన్నారు.

అనకాపల్లి టౌన్‌: పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుడినే పూజించాలని వైఎస్సార్‌ సీపీ 84వ వార్డు ఇన్‌చార్జి కోరుకొండ రాఘవ సూచించారు. వినాయక చవితి సందర్భంగా కోట్నివీధిలో మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈశ్వరరావు, కేతిరెడ్డి ప్రసాద్‌, మెల్లి శ్రీను, తదితరులు పాల్గొన్నారు. నినాయక నిమజ్జనోత్సవ కమిటీ వ్యవస్ధాపకుడు ఆడారి కుమారస్వామి ఆధ్వర్యంలో విజయరామరాజు పేట, గాంధీనగర్‌, తదితర ప్రాంతాల్లో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. లక్ష్మీదేవిపేటలో పీలా రాజారావు చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. దొడ్డి శ్రీనివాసరావు, ముప్పన లింగేశ్వరావు, ఆడారి రాజు, రేబాక మధు పాల్గొన్నారు.

పాయకరావుపేట: పట్టణంలో కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పీసీసీ జనరల్‌ సెక్రటరీ జగతా శ్రీనివాస్‌ భక్తులకు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. వినాయక వ్రత కథ కల్ప పుస్తకాలను పంపిణీ చేశారు. కాపునాడు పట్టణాధ్యక్షుడు గొంతిన అనిల్‌, సమరసత సేవా సమితి ప్రతినిధులు కట్టా వీరబాబు, మేడిశెట్టి దివాణం పాల్గొన్నారు.

అనకాపల్లి: మట్టి గణపతులను మాత్రమే పూజించాలని వైఎస్సార్‌సీపీ 80వ వార్డు ఇన్‌చార్జి కె.ఎం.నాయుడు తెలిపారు. స్థానిక గవరపాలెం రజకకాలనీ, గంగరావిచెట్టు ప్రాంతాల్లో భక్తులకు ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేశారు. పార్టీ యుజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కర్రి రుద్రి, నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్‌ కొణతాల మురళీకృష్ణ, పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు కాండ్రేగుల హైమావతి పాల్గొన్నారు.

అచ్యుతాపురం రూరల్‌: ఉజ్వల చారిటబుల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం కొండకర్లలో ఎస్‌ఐ వెంకట్రావు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. వైద్యుడు లాలం సింహాచలంనాయుడు, గ్రామ పెద్దలు పప్పల రమణారావు, కట్టుమూరి చిట్టేశ్వరరావు, సుధాకర్‌, సన్యాసిరావు, శ్యామల రావు, భాను, మారిశెట్టి వెంకటప్పారావు, బొడ్డేడ రామ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement