బుచ్చెయ్యపేట : ఐయితంపూడి వైఎస్సార్‌సీపీ యూత్ అధ్యక్షుడు ముచ్చకర్ల శివ మట్టి వినాయకులను తయారు చేయించి, ఆదివారం జెడ్పీటీసీ దొండా రాంబాబు, మండల పార్టీ అధ్యక్షుడు జోగా కొండబాబు చేతుల మీదుగా పలువురికి పంపిణీ చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు సుంకరి శ్రీను, గాంధీ, గాడి శ్రీను, గోపిశెట్టి శ్రీను, ఐయితరెడ్డి ప్రసాద్, కొల్లి దశరధ, వరహాలబాబు, గాడి శ్రీను, రాము, అప్పారావు పాల్గొన్నారు.
మాడుగుల రూరల్ : కె.జె.పురం గ్రామంలో స్థానిక బిక్యూట్ గార్మెంట్స్ యజమాని కాళ్ల హరిబాలకృష్ట సహకారంతో సుమారు 150 మట్టి విగ్రహాలను అందజేశారు.
మాకవరపాలెం: పర్యావరణాన్ని కాపాడేందుకు అందరూ మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని ఎంపీపీ రుత్తల సర్వేశ్వరరావు కోరారు. కొండల అగ్రహారంలో గల శారదాంబ పెట్రోల్ బంక్ వద్ద కన్నూరు నాయుడు సమకూర్చిన మట్టి వినాయక విగ్రహాలను ఆదివారం పంపిణీ చేశారు. మాకవరపాలెంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలోనూ మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.
నాతవరం : మండలంలో పలు గ్రామాల్లో ఆదివారం మండల బీజేపీ అధ్యక్షుడు సబ్బి కుమారస్వామి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు.
మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ
నర్సీపట్నం : గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయ మెయిన్ రోడ్డు ప్రత్యేక శిబిరం ఏర్పాటు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ పి.శ్రీనివాసరావు విచ్చేసారు. ఆయన చేతుల మీదగా క్లబ్ సభ్యులు వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. క్లబ్ ఆధ్వర్యంలో 300 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పర్యావరణ హితం కోరి గ్రీన్ క్లబ్ వారు మట్టి విగ్రహాలు పంపిణీ చేయటం అభినందనీయమన్నారు. క్లబ్ ప్రతినిథి డి.గోపీనాథ్ పాల్గొన్నారు. అలాగే జాప్ యూనియన్ ఆధ్వర్యంలో పాత్రికేయులు అబిద్‌సెంటర్‌లో ప్రత్యేక శిబిరం ఏర్పాటు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన టౌన్ సీఐ ఎస్.కె.గపూర్, యూనియన్ రాష్ట్ర కార్యదర్శి యలమంచిలి వేణు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోసూరు రామకృష్ణ విగ్రహాలను పంపిణీ చేశారు.


