సీపీఐ, ఏపీ చెరకు రైతు సంఘాల ఆగ్రహం
చోడవరం: రైతు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన తమను అడ్డుకోవడం హేయమైన చర్య అని సీపీఐ జిల్లా సంయుక్త కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, చెరకు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేచలపు వెంకటరమణ(కాసుబాబు) ఆగ్రహం వ్యక్తం చేశా రు. కె. కోటపాడు మండలం ఏ కోడూరులో శనివారం సీఎం చంద్రబాబునాయుడు బహిరంగ సభలో గోవాడ చర్కెర కర్మాగారం చెరకు రైతుల బకాయిలు, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో వ్యవసాయ దయనీయ పరిస్థితులపై వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన తమను పోలీసులు అడ్డుకోవడంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం గోవాడ సుగర్ ఫ్యాక్టరీని పూర్తిగా మూసివేసి చెరకు రైతులను, కార్మికులను రోడ్డున పడేసిందని వాపోయారు. వీరి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడానికి సభ వద్దకు వెళ్లనీయకుండా పోలీసులతో అడ్డుకుని ప్రజాస్వామ్య హక్కులను కాలరాశారని ధ్వజమెత్తారు.
అభ్యసన సామర్థ్యాలు
పెంపొందేలా బోధన
సబ్బవరం: విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలను పెంపొందించేలా ఉపాధ్యాయులు బోధన సాగించాలని డీఈవొ జి.జి.ఎస్.నాగేశ్వరరావు సూచించారు. సబ్బవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాన్ని ఆయన సందర్శించి మ్యాథ్స్, సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పెంచేందుకు అవసరమైన అంశాలపై సమావేశాల్లో చర్చించి, పరస్పరం బోధనా పద్ధతులను మెరుగుపరుచుకోవాలన్నారు.


