పరదేశమ్మ విగ్రహానికి ప్రత్యామ్నాయం చూపాలి | - | Sakshi
Sakshi News home page

పరదేశమ్మ విగ్రహానికి ప్రత్యామ్నాయం చూపాలి

Aug 23 2026 12:16 AM | Updated on Aug 23 2026 12:16 AM

అచ్యుతాపురం రూరల్‌: చోడపల్లి పంచాయితీ పరిధి లో గ్రామదేవత పరదేశమ్మ తల్లి విగ్రహాన్ని తొలగించే ప్రయత్నాన్ని శనివారం గ్రామస్తులు అడ్డుకున్నారు. అచ్యుతాపురం–అనకాపల్లి రహదారి విస్తరణలో భాగంగా విగ్రహాన్ని ప్రత్యామ్నాయ ప్రదేశానికి తరలించకుండా తొలగించేందుకు చర్యలు చేపట్టడం అన్యాయమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహానికి ముందుగా తగిన స్థలం కేటా యించి, కొత్తగా ప్రతిష్టాపన పూర్తి చేసిన అనంత రం ప్రస్తుత విగ్రహాన్ని తరలించాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ అధికారులు చర్యలు చేపట్టాలని కోరా రు. ఈ ఆందోళనకు సీఐటీయూ మండల కన్వీనర్‌ కూండ్రపు సోమునాయుడు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కాకి శంకర్‌, కాకి అవతారం, పోలవరపు పారునాయుడు, దమ్ము చండి, గెంజి రామకృష్ణ, పెంకి నరసింగరావు, గోవిందు, లోవరాజు, తదితరులు పాల్గొన్నారు.

విగ్రహం తొలగింపును అడ్డుకున్న గ్రామస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement