చీడికాడ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తిరిగి అధికారం చేపట్టి, వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ మండలంలోని జైతవరానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సింహాచలం దేవస్థానానికి పాదయాత్రగా బయలుదేరారు. జైతవరానికి చెందిన వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, చీడికాడ పార్టీ ఉపాధ్యక్షుడు ఈర్లె చైతన్య ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారు జామున 4గంటలకు జైతవరం నుంచి 10 మంది కార్యకర్తలు పాదయాత్ర మొదలుపెట్టారు. గ్రామం నుంచి 60 కిలోమీటర్ల దూరంలో సింహాచలం వరహాలక్ష్మీనృసింహాస్వామి వారి దేవాలయానికి రాత్రి 9గంటలకు చేరుకుని స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. వారికి చీడికాడ మండలంలోని జేబీపురం, చినగోగాడ, చెట్టుపల్లి, అర్జునగిరి తదితర గ్రామాలకు చెందిన నేతలు, కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. చైతన్య మాట్లాడుతూ జగన్ సీఎం కావాలని, బూడి ఎమ్మెల్యేగా గెలవాలని ఆకాంక్షిస్తూ సింహాద్రి అప్పన్నకు మొక్కులు చెల్లించుకున్నట్టు తెలిపారు.
జగన్ సీఎం కావాలని సింహాద్రి అప్పన్నకు మొక్కులు


