పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
కె.కోటపాడు: మాడుగుల నియోజకవర్గంలో కె.కోటపాడు మండలం ఎ.కోడూరు గ్రామంలో ఈ నెల 22న జరిగే స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గోనున్నారు. ఇందుకు సంబంధించిన పనులను బుధవారం ఎ.కోడూరు గ్రామంలో కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్‌పటేల్, ఎస్పీ తుహీన్‌సిన్హా పర్యవేక్షించారు. స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర, ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహణకు సంబంధించిన సభావేదికను ఏర్పాటు చేసేందుకు గల అనువైన స్థలాన్ని పరిశీలించారు. పొక్లెయిన్‌లతో శుభ్రం చేయిస్తున్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. ఎ.కోడూరులో పారిశుధ్య పనులను పలు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు చేయిస్తున్నారు.


