కె.కోటపాడులోకలెక్టర్‌, జేసీ పర్యటన | - | Sakshi
Sakshi News home page

కె.కోటపాడులోకలెక్టర్‌, జేసీ పర్యటన

Aug 19 2026 12:18 AM | Updated on Aug 19 2026 12:18 AM

22న స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం

పాల్గోనున్న సీఎం చంద్రబాబు!

కె.కోటపాడు : ఈ నెల 22న మండలంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నట్టు తెలిసింది. ఆ రోజున ముందుగా స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గోనున్న చంద్రబాబు తరువాత ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం మాడుగుల నియోజకవర్గ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో పాల్గోనున్నారు. కె.కోటపాడు మండలంలో సీఎం చంద్రబాబు పాల్గొనే గ్రామాన్ని గుర్తించేందుకు జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌, జేసీ శౌర్యమాన్‌పటేల్‌ మంగళవారం సాయంత్రం పర్యటించారు. మేడిచర్ల, ఎ.కోడూరు, చౌడువాడ గ్రామాల్లో పర్యటించారు. వీటిల్లో చౌడువాడ గ్రామంలో సీఎం కార్యక్రమాన్ని జరిపేందుకు ఎక్కువ అవకాశాలున్నట్టు భావిస్తున్నారు. అయితే సీఎం పర్యటనపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement