బుచ్చెయ్యపేట : మండలంలో గల పలు గ్రామాల్లో భూ ఫిర్యాదులపై రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం పరిశీలించారు. మంగళవారం ఆయన లోపూడిలో రెల్లి అప్పలనరస భూ ఫిర్యాదుపై అక్కడ స్థలం పరిశీలించారు. అక్కడ సాగు రైతుల నుంచి భూ రికార్డుల వివరాలను పరిశీలించారు. బుచ్చెయ్యపేట తహసీల్దార్ కార్యాలయంలో కొమళ్లపూడిలో విద్యుత్ సబ్‌స్టేషన్‌కు సేకరించిన భూ నిర్వాసితుల నుంచి ఫిర్యాదులను తీసుకుని న్యాయం జరిగేలా చూస్తామన్నారు. బుచ్చెయ్యపేట మండలంలో శింగవరం, పొట్టిదొరపాలెం,లోపూడి తదితర గ్రామాల్లో భూ సమస్యలను ఎస్సీ సెల్ జిల్లా యువజన అధ్యక్షుడు బూసి కోటి ఆయన దృష్టికి తీసుకొచ్చారు. పలువురు బడాబాబులు దళితుల నుంచి బలవంతంగా భూ సేకరణ చేశారని వాటిపై విచారణ చేయాలని ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ లక్ష్మి, మండల సర్వేయర్ శ్రీనివాసరావు, వీఆర్వో సుధాకర్, సచివాలయ సర్వేయర్ సాయి పాల్గొన్నారు.


