నర్సీపట్నం : ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో జరగనున్న 6వ జాతీయ గ్రాప్లింగ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలకు నర్సీపట్నం నింజాస్ అకాడమీ నుంచి 18 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని కోచ్ వేపాడ ప్రియాంక తెలిపారు. ఈ నెల 21 నుండి 23 వరకు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నట్టు ఆమె తెలిపారు. నేషనల్ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులను నింజాస్ అకాడమీ చైర్మన్ వెలగా నారాయణరావు, జనరల్ సెక్రటరీ సుతాపల్లి శ్రీకాంత్ శాప్ కోచ్ అబ్బు అభినందించారు. ప్రభుత్వం అందిస్తున్న 3 శాతం క్రీడా రిజర్వేషన్‌తో అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు.


