అనకాపల్లి: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్‌శాఖ ప్రత్యేక దృష్టి సాధించడం జరుగుతుందని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. పరవాడ ఈఐఎస్‌ఎఐ ఫార్మా కంపెనీ సీఎస్‌ఆర్ నిధులతో సమకూర్చిన 25 బాడీ వార్న్ కెమెరాలను ఎస్పీకి మంగళవారం కంపెనీ ప్రతినిధులు గిరీష్ దీక్షిత్, ఆనంద్ గాల్ఫాడే, మదన్‌మోహన్‌లు ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో వివిధ పోలీస్‌స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి ఈ కెమెరాలను త్వరలో అందజేయడం జరుగుతుందన్నారు.


