ప్రమాదవశాత్తూనదిలో పడి యువతి మృతి | - | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తూనదిలో పడి యువతి మృతి

Aug 19 2026 12:18 AM | Updated on Aug 19 2026 12:18 AM

పాయకరావుపేట : మండలంలో కుమార పురం గ్రామానికి చెందిన చాపల నందిని (19) గ్రామ సమీపాన గల పంపానదిలో ప్రమాదవశాత్తూ పడి మృతి చెందినట్టు ఎస్‌ఐ జె.పురుషోత్తం తెలిపారు. మృతురాలు చాపల నందిని ఈ నెల 14 వ తేదీన మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్లి మరలా ఇంటికి తిరిగి రాలేదు. 15 వ తేదీన తన కుమార్తె కనిపించలేదని తల్లి చేపల బంగారు లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. అయితే తన కుమార్తె గ్రామ శివారు పంపానదిలో చనిపోయి ఉందని, మూడు నెలల నుండి టైఫా యిడ్‌ జ్వరంతో బాధపడుతుందని, పాయకరావుపేటలో చికిత్స పొందేదని, మానసిక అనారోగ్యంతో ఉండేదని, 14న నందిని బహిర్భూమికి వెళ్లి కాలుజారి నదిలో పడిపోయి మృతి చెందిందని ఆమె తల్లి మరలా ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ జె.పురుషోత్తం తెలిపారు. మృతదేహాన్ని నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించడం జరిగిందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement