ఫార్మసిస్టు అదృశ్యంపై ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

ఫార్మసిస్టు అదృశ్యంపై ఫిర్యాదు

Aug 19 2026 12:18 AM | Updated on Aug 19 2026 12:18 AM

దేవరాపల్లి : మండలంలోని రైవాడ గ్రా మానికి చెందిన సారిపల్లి ఎరుకునాయుడు (31) అదృశ్యమైనట్టు అతని భార్య కృష్ణ కుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి స్థానిక ఎస్‌ఐ వి.సత్యనారాయణ మంగళవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అదృశ్యమైన ఎరుకునాయుడు అల్లూరి జిల్లా హుకుంపేటని ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మసిస్టుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఉద్యోగ రీత్యా నెల రోజుల క్రితం నుంచి పాడేరులోని అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారన్నారు. ఈ నెల 2న తన సర్టిఫికెట్లు రెన్యువల్‌ చేయించుకోవాలని భార్యతో కలిసి స్వగ్రామం రైవాడ వచ్చాడన్నారు. అయితే ఈ నెల 3న ఉదయం 11 నుంచి ఒంటి గంట ప్రాంతంలో ఇంటి నుంచి అదృశ్యమయ్యాడని, అప్పటి నుంచి పరిసర గ్రామాలతో పాటు బంధువులు ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభించలేదని అతని భార్య ఈ నెల 10న ఫిర్యాదు చేసిందన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ వ్యక్తి ఆచూకీ లభిస్తే వెంటనే పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement