బస్సులో మర్చిపోయిన బ్యాగ్‌ అందజేత | - | Sakshi
Sakshi News home page

బస్సులో మర్చిపోయిన బ్యాగ్‌ అందజేత

Aug 19 2026 12:18 AM | Updated on Aug 19 2026 12:18 AM

అనకాపల్లి : విశాఖ నుంచి అనకాపల్లి వస్తున్న 500 మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడు ఈనెల 16న బ్యాగ్‌ను మర్చిపోయి దిగిపోవడం జరిగిందని డిపో మేనేజర్‌ రాజేశ్వరి అన్నారు. పట్టణానికి చెందిన వెంకటరాజు ఈనెల 16న 500 బస్‌లో రాత్రి సమయంలో బ్యాగ్‌ను మర్చిపోయి వెళ్లడంతో బస్‌ కండక్టర్‌ కె.బి.ఆర్‌.లక్ష్మి బ్యాగ్‌ను డిపోలో సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించింది. విషయం తెలుసుకున్న ప్రయాణికుడు వెంకటరాజు ఈనెల 18న డిపో మేనేజర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో సెక్యూరిటీలో వద్ద భద్రపర్చిన బ్యాగ్‌ను చూపించగా వెంకటరాజు తమ బ్యాగ్‌గా గుర్తించడంతో డిపో మేనేజర్‌ రాజేశ్వరి అతనికి బ్యాగ్‌ను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement