● విశ్వహిందూ మహాసంఘ జిల్లా సాంస్కృతిక విభాగం ఉపాధ్యక్షుడు చెల్లయ్యనాయుడు
మునగపాక : మండలంలోని మూలపేటకు చెందిన బొడ్డేడ చెల్లయ్యనాయుడు విశ్వహిందూ మహాసంఘ భారత్ జిల్లా సాంస్కృతిక విభాగం ఉపాధ్యక్షునిగా నియమితులయ్యారు. ఈ మేరకు విశ్వహిందూ మహా సంఘ భారత్ అధ్యక్షుడు శ్రీ లంకా గణేష్ నుంచి ఉత్తర్వులు అందాయి. చెల్లయ్యనాయుడు మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించిన రాష్ట్ర గోసంరక్షణ అధ్యక్షుడు యాసపు శ్రీనుతో పాటు ఇతర పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు పాటుపడతానని పేర్కొన్నారు.


