ఉత్సాహంగా జిల్లాస్థాయి తైక్వాండో పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా జిల్లాస్థాయి తైక్వాండో పోటీలు

Aug 17 2026 8:23 AM | Updated on Aug 17 2026 8:23 AM

యలమంచిలి రూరల్‌: పట్టణంలో కొత్తపేట రామాలయం వద్ద ఆదివారం జరిగిన మొదటి జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు ఉత్సాహంగా సాగాయి. జిల్లాలో పలు తైక్వాండో క్లబ్బుల నుంచి మొత్తం 108 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 38 మంది బంగారు పతకాలు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్టు జిల్లా తైక్వాండో అసోసియేషన్‌ కార్యదర్శి నగిరెడ్డి సత్యనారాయణ తెలిపారు.రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న వారిలో 25 మంది బాలురు, 13 మంది బాలికలు ఉన్నారు. వీరంతా ఈ నెల 21న శ్రీకాకుళంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గోనున్నట్టు చెప్పారు. మరో 11 మంది బాలురు రజిత పతకాలు సాధించారు.అంతకుముందు తైక్వాండో పోటీలను ఏజీపీ రాజాన గోవిందరావు ప్రారంభించారు. విద్యార్థులు, యువకులు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని, దీనివల్ల దేహదారుఢ్యంతో పాటు,మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని తల్లిదండ్రులకు సూచించారు. పోటీల అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ద్వారపురెడ్డి వెంకటరావు,కార్యదర్శి శ్రీనివాసరావు,ఉపాధ్యక్షుడు ఎల్వీ రామకృష్ణ, న్యాయవాదులు రాయవరపు సుధాకర్‌,వేముశెట్టి కృష్ణ,పోలిశెట్టి వీర ప్రజానాయక్‌,కూనిశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

38 మందికి బంగారు పతకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement