కలెక్టరేట్‌లో ఘనంగా జెండా పండగ
మాడుగుల రూరల్: కన్న కూతురే తల్లిని సన్నికాలురాయితో తలమీద, ఛాతీభాగంలో కొట్టి గాయపరిచిన సంఘటన గాదిరాయి లో జరిగింది. స్థానిక ఎస్‌ఐ జి.నారాయణరా వు శనివారం అందించిన వివరాలు ఇలా ఉన్నా యి. మండలంలో గాదిరాయి గ్రామానికి చెందిన పెచ్చేట్టి చిలుకమ్మ అనే మహిహిళ తన కుమారై సిరిసొల్ల దేవి, అల్లుడు వెంకటరమణతో కలిసి నివాసం ఉంటోంది. చిలుకమ్మ ఎడమకాలుకు రెండు సంవత్సరాలు క్రితం ఆపరే షన్ జరిగింది. విశాఖపట్నంలో డాక్టర్ వద్దకు వెళ్లేందుకు గతంలో డాక్టరు రాసిన మందుల చీటి, ట్రిట్‌మెంట్‌కు సంబంధించిన ఫైల్ ఇవ్వాలని కుమార్తె దేవిని శుక్రవారం రాత్రి కోరింది. ఆమె ఇవ్వకపోగా, తీవ్రంగా దూషించింది. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో చిలుకమమ్మ నిద్రిస్తుండగా తన ఇంట్లో ఉన్న సన్నికాలురాయితో తలపైన, ఛాతీభాగంలో బలంగా దేవి కొట్టి గాయపరిచింది. దీంతో చిలకమ్మకు తీవ్రంగా రక్తస్రావమైంది. వెంటనే కుటుంబ సభ్యులు మాడుగుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్‌ఐ నారాయణరావు తెలిపారు.
తుమ్మపాల: కలెక్టర్ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ విజయ కృష్ణన్ జాతీయ జెండాను ఆవిష్కరించి, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్‌తో కలిసి వందనం సమర్పించారు. కలెక్టరేట్ అధికారులకు, సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి, విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణ రావు, సీపీవో రామారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయంలో...
అనకాపల్లి: స్థానిక ఎస్పీ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్పీ తుహిన్ సిన్హా, ఎస్పీ సతీమణి, 3వ అదనపు సివిల్ న్యాయమూర్తి, 13వ అదనపు జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ నిఖితా సెంగర్‌లు జాతీయ జెండాను ఆవిష్కరించారు అంతకుముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనకు లభించిన స్వేచ్ఛ ఎంతోమంది త్యాగధనుల పోరాట ఫలితమన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సమరయోధులను స్మరించుకుంటూ, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్‌రావు, డీఎస్పీలు ఇ.శ్రీనివాసరావు, కె.రవికుమార్, జి.ఆర్.ఆర్.మోహన్, బి.మోహన్‌రావు, సీఐలు టి.లక్ష్మి, శ్రీనివాసరావు, ఎం.వెంకటనారాయణ, జి.ప్రేమ్‌కుమార్, అశోక్‌కుమార్, రమేష్, రమణయ్య రామకృష్ణారావు, మన్మధరావు, తదితరులు పాల్గొన్నారు.


