అనకాపల్లి/తుమ్మపాల: 80వ స్వాతంత్య్ర దినోత్సవానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం ఉదయం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే జిల్లా స్థాయి వేడుకల్లో రాష్ట్ర హోం మంత్రి మంగలపూడి అనిత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించనున్నారు. అనంతరం స్వాతంత్య్ర దినోత్సవ సందేశం ఇవ్వనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించే 24 శకటాల ప్రదర్శించనున్నారు. ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు స్టాళ్లను ఏర్పాటు చేశారు. వేడుకల్లో స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజ లు పాల్గోనున్నారు. కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించనున్న కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ జాతీయపతాకాన్ని ఆవిష్కరించనున్నారు. జిల్లాలో 560 మంది ఉద్యోగులకు మెరిట్ అవార్డులు ప్రకటించారు.


