ఆస్తులపై ప్రభుత్వానికేం అధికారం ఉంది ? | - | Sakshi
Sakshi News home page

ఆస్తులపై ప్రభుత్వానికేం అధికారం ఉంది ?

Aug 15 2026 12:52 AM | Updated on Aug 15 2026 12:52 AM

ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా రైతుల షేర్‌ క్యాపిటల్‌, ఫ్యాక్టరీ లాభాలతో ఏర్పడిన ఈ ఆస్తులను ఏపీఐఐసీకి అప్పగించడానికి అసలు ఏం అధికారం ఉంది.? రైతుల అభిప్రాయం తెలుసుకున్న తర్వాతే ఫ్యాక్టరీ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలి. అన్ని షుగర్‌ ఫ్యాక్టరీలకు ప్రభుత్వం ఇచ్చిన మొత్తం సుమారు రూ.100–120 కోట్లకు మించదు, రైతుల ప్రయోజనం కోసం ఆ మొత్తాన్ని ప్రభుత్వం మాఫీ చేయాలి. ఏటికొప్పాక ఫ్యాక్టరీ గతంలో లాభాలతో నడిచింది, చంద్రబాబు వెన్నుపోటు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లలో నష్టాల్లోకి వెళ్లింది. వైఎస్సార్‌ హయాంలో రైతులను ఆదుకునే విధానాలు అమలు చేస్తే, ఇప్పుడు ఫ్యాక్టరీల ఆస్తులను లిక్విడేషన్‌ పేరుతో ఏపీఐఐసీకి అప్పగించాల్సిన పనిలేదు కదా. రైతులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో రైతుల తరఫున ఉద్యమిస్తాం. – సూర్యనారాయణ రాజు, మాజీ ఎమ్మెల్సీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement