ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. 60 శాతం మంది వ్యవసాయ రంగం మీదే ఆధారపడి ఉన్నారు. కానీ చంద్రబాబు రైతులను వరి వేయొద్దని, చెరకు వేయొద్దని, మిర్చి, పొగాకు ఏదీ వద్దని అంటు న్నాడు. మరి రైతులు ఏం సాగు చేయాలి? ఈ ప్రభుత్వం దేనికి మద్దతు ధర ఇస్తుంది? సుగర్ ఫ్యాక్టరీలకు చెందిన విలువైన భూములు దోచుకోవడానికి, బినామీలకు కట్టబెట్టడానికే చంద్రబాబు కుట్ర పూరిత జీవోలు తెస్తున్నారు. ఫ్యాక్టరీల్ని ఆదుకునేందుకు నెల రోజుల టైమ్ ఇస్తున్నాం. తర్వాత చెరుకు రైతుల ఆగ్రహం ఎలా ఉంటుందో ప్రభుత్వం చూస్తుంది. – గుడివాడ అమర్‌నాథ్, మాజీ మంత్రి


