గోవాడ చక్కెర పరిశ్రమలో 2024లో చేసిన క్రషింగ్‌కి ఇప్పటి వరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదు. చెరకు తోలిన రైతులకు రూ.30 కోట్ల బకాయిలు ఉన్నా ఇంత వరకూ చెల్లించలేదు. రెండేళ్లుగా జనరల్ బాడీ మీటింగ్ కూడా నిర్వహించలేదు. ఇప్పటికై నా కలెక్టర్ ఆధ్వర్యంలో సహకార సంఘంలో భాగస్తులుగా ఉన్న రైతులను కూడా పిలిచి వాస్తవ పరిస్థితులు వివరించి అప్పుడే ప్రభుత్వం ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. లేదంటే చెరకు రైతులతో మహా ఉద్యమం తప్పదు.
– బూడి ముత్యాలనాయుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి


