తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌నుప్రారంభించిన హోంమంత్రి అనతి
నక్కపల్లి: స్థానిక ఏరియా ఆస్పత్రిని 100 పడకల స్థాయికి అప్‌గ్రేడ్ చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గురువారం ఆమె ఆస్పత్రిలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 100 పడకల స్థాయికి పెంచడంతోపాటు ట్రామాకేర్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం స్థానిక వారపు సంతలో హెటెరోవారి సీఎస్‌ఆర్ నిధులు రూ.60లక్షలతో నిర్మించిన షెడ్లను మంత్రి అనిత ప్రారంభించారు. గత ఏడాది అగ్నిప్రమాదం సంభవించి ఇక్కడ తాటాకు పాకలన్నీ దగ్ధమయ్యాయి.మూడు బ్లాకులలో 65 దుకాణాలు నిర్మించడం జరిగిందన్నారు. ఎండుచేపలకు ఎగుమతులకు ప్రసిద్ధి గాంచిన మార్కెట్లో షెడ్లు నిర్మించిన హెటెరో వారికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో హెటెరో ప్రతినిధులు కుళ్లాయిరెడ్డి, ఈశ్వర శర్మ, ఎంపీడీవో చలపతిరావు, ఏవో సీతారామరాజు, తహసీల్దార్ చిన్నికృష్ణ పాల్గొన్నారు.


