‘వెన్నుపోటుకు రెండేళ్లు ’ ర్యాలీలు విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘వెన్నుపోటుకు రెండేళ్లు ’ ర్యాలీలు విజయవంతం చేయాలి

Jun 12 2026 12:29 AM | Updated on Jun 12 2026 12:29 AM

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌

మునగపాక: ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ కేంద్రాల్లో శుక్రవారం భారీ ర్యాలీలు నిర్వహించేలా చూడాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ కోరారు. గురువారం రాత్రి ఆయన సాక్షితో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో కలిసి సమన్వయకర్తల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించాలన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌లు అమలు కాలేదని, అన్ని వర్గాల ప్రజలను దగా చేయడంతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీలకు చంద్రబాబు సర్కారు తిలోదకాలు ఇవ్వడం విచారకరమన్నా రు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పేరోజులు ఆసన్నమయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించనున్న ర్యాలీలు విజయవంతమయ్యేలా పార్టీ శ్రేణులు సహకరించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement