ఆర్టీసీ డ్రైవింగ్‌ స్కూల్లో | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ డ్రైవింగ్‌ స్కూల్లో

Jun 12 2026 12:29 AM | Updated on Jun 12 2026 12:29 AM

206 మందికి శిక్షణ

206 మందికి శిక్షణ

అనకాపల్లి: రానున్న రోజుల్లో భారీ వాహనాల నడిపే డ్రైవర్లకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని, పురుషులతో సమానంగా మహిళలు భారీ వాహనాల డ్రైవింగ్‌కు పోటీ పడుతున్నారని ప్రజా రవాణాశాఖ అధికారి వి.ప్రవీణ అన్నారు. ప్రజా రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 13వ బ్యాచ్‌ హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ శిక్షణ ముగింపు కార్యక్రమానికి గురువారం ఆమె హాజరై సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 13వ బ్యాచ్‌లో 16 మంది డ్రైవర్లకు(ప్రైవేట్‌) శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఆర్టీసీలో డ్రైవింగ్‌ స్కూల్లో శిక్షణ పూర్తి చేసుకున్న డ్రైవర్లకు ఆర్టీసీలో డ్రైవర్‌ ఉద్యోగాలు భర్తీ చేసే సమయంలో గుర్తింపు ఉంటుందన్నారు. నేటి వరకూ 206 మంది డ్రైవర్లు శిక్షణ పూర్తి చేసుకున్నట్టు ఆమె చెప్పారు. డ్రైవింగ్‌తో పాటు, బస్‌ మెకానిజమ్‌పై కూడా శిక్షణ ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్‌ హనుమ శ్రీ, డ్రైవింగ్‌ స్కూల్‌ డీఈవో బాపు నాయుడు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement