ఎమ్మెల్సీ చిరంజీవిరావును సన్మానిస్తున్న డి.గోపీనాథ్, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు
నర్సీపట్నం: మున్సిపాలిటీ పరిధిలో పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు హౌస్ రెంట్ అలవెన్స్ 12 శాతం పెంచడం ఊరట నిచ్చిందని జేఏసీ కోచైర్మన్ డి.గోపీనాథ్ అన్నారు. హౌస్‌రెంట్ అలెవన్స్ పెంపునకు కృషి చేసిన ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావును ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డి.గోపీనాథ్ మాట్లాడుతూ కొన్నేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగుల కల నేరవేర్చిన ఎమ్మెల్సీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎన్‌ఎంయు అధ్యక్షుడు నారాయణ, ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు మూర్తి, హెల్త్ డిపార్మెంట్ రమణబాబు, ఇరిగేషన్ భరత్, ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హనుమంతురావు, పీఆర్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.వరహాలనాయుడు, జి.వి.రమేష్ పాల్గొన్నారు.


