డాక్టర్ పట్టా పొందిన అఖిలాంజలిని సన్మానిస్తున్న అప్పలరాజు
పాయకరావుపేట : అపారమైన సంకల్పం, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ అడ్డంకినైనా అధిగమించవచ్చని మత్స్యకార యువతి నిరూపించారు. పాయకరావుపేట మండలంలో మత్స్యకార గ్రామమైన అద్దరిపేటకు చెందిన లంకె అఖిలాంజలి చదువుపై ఉన్న మక్కువతో రాణించి, ఇటీవల ఎంబీబీఎస్ పట్టా అందుకున్నారు. దీంతో మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మత్స్యకార సంఘం అధ్యక్షుడు మోసా అప్పలరాజు శనివారం ఆమెను అద్దరిపేటలో సన్మానించారు. అఖిలాంజలిని స్ఫూర్తిగా తీసుకుని మత్స్యకార బాలికలు చదువుల్లో రాణించాలన్నారు.


