నేడు నూకాంబిక విగ్రహ పునఃప్రతిష్ట | - | Sakshi
Sakshi News home page

నేడు నూకాంబిక విగ్రహ పునఃప్రతిష్ట

Mar 8 2026 7:40 AM | Updated on Mar 8 2026 7:40 AM

● సాయంత్రం 3 గంటల నుంచి భక్తులకు దర్శనం

● సాయంత్రం 3 గంటల నుంచి భక్తులకు దర్శనం

కలశాలకు పూజలు చేస్తున్న ఎమ్మెల్యే కొణతాల

అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పు గరవపాలెం నూకాంబిక ఆలయంలో రెండో రోజైన శనివారం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకుడు రేజేటి శ్రీరామాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ట, రాజగోపురం ప్రతిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బాలాలయంలో అమ్మవారిని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ దర్శించుకుని కలశాలకు పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ దంపతులు హోమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్‌ యళ్ల శ్రీధర్‌, చైర్మన్‌ పీలా నాగశ్రీను మాట్లాడుతూ అమ్మవారి నూతన ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ట ప్రారంభం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహిస్తున్నామన్నారు. తెల్లవారుజాము నుంచి వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించి, రాజగోపురం పసిడి కలశ పునఃప్రతిష్ట అనంతరం సాయంత్రం 3 గంటలకు ఆలయంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో వేదపండితులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement