కశింకోట పంచాయతీ కార్యాలయంలో ఇంటి పన్నుల వసూలుపై సమీక్షిస్తున్న సీఈవో నారాయణమూర్తి
కశింకోట : ఇంటి పన్నుల వసూలును ఈ నెల 15లోగా శతశాతం పూర్తి చేయాలని జిల్లా పరిషత్ సీఈవో నారాయణమూర్తి ఆదేశించారు. స్థానిక పంచాయతీ కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. పన్నుల వసూలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా రూ.82 లక్షల మేర పన్నుల బకాయిలు వసూలు కావలసి ఉందని గుర్తించారు. వీటిని సత్వరమే వసూలు చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. అలాగే వెదురుపర్తి, నూతలగుంటపాలెం, ఉగ్గినపాలెం పంచాయతీల్లో పన్నుల వసూలు వెనుకబడి ఉందని, వాటిని కూడా పూర్తిగా వసూలు చేయడానికి కార్యదర్శులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పారిశుధ్యం పని తీరును పరిశీలించారు. డిప్యూటీ ఎంపీడీవో తోటారావు, సచివాలయ, పంచాయతీ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.


