బుచ్చెయ్యపేట : వడ్డాది వేంకటేశ్వరస్వామి కల్యాణ మహాత్సవాల్లో దొంగనోట్లు కలకలం రేపింది. కల్యాణ మహోత్సవాలు సందర్భంగా పలువురు వ్యాపారులకు దొంగనోట్లు అంటకట్టారు. వడ్డాదికి చెందిన సంగడి అప్పారావు ఐస్ క్రీంలు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. ఇతనికి వచ్చిన డబ్బుల్లో ఒకటి రూ, 200 దొంగనోటు రావడంతో ఆందోళన చెందాడు. ఇతనిలాగే కొంత మంది వ్యాపారులకు దొంగనోట్లు రాగా భయపడి వచ్చిన నోట్లును చింపి పారేశారు. గతంలో వడ్డాది సంతలో రూ, 500, 1,000, 2,000 దొంగ నోట్లు ఎక్కువగా చలామణి చేసేవారు. మరలా ఇపుడు దొంగనోట్లు చలామణి అవడంతో పలువురు వ్యాపారులు హడలిపోతున్నారు.


