చోడవరం : కొన్ని చోట్ల స్థావరాలు ఏర్పాటు చేసుకొని స్మగ్లర్లు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారన్న అనుమానంతో చోడవరం పట్టణంలో పలు లాడ్జిలు, నిర్మానుష్య ప్రదేశాల్లో పాడుబడిన ఇళ్లను పోలీసులు మంగళవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని తెచ్చి చోడవరం పట్టణంలో పలు లాడ్జిలు, శివారు ప్రదేశాల్లో పాతబడిన ఇళ్లు, నిర్మానుష్య ఖాళీ ప్రదేశాల్లో దాచి ఉంచి అక్కడ నుంచి అనువైన సమయంలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనే అనుమానంతో ఎస్‌ఐ జోగారావు తన సిబ్బందితో విస్తృతంగా తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో ఎటువంటి గంజాయి గాని, అనుమానితులుగా గాని వీరికి దొరకలేదు. దీనితో నిఘా మరింత పెంచుతామని ఎస్‌ఐ తెలిపారు.


